పరమశివుడి మూడో కన్ను రహస్యం – అది తెరిస్తే ఏమి జరుగుతుంది?
పరమశివుడి మూడో కన్ను రహస్యం – అది తెరిస్తే ఏమి జరుగుతుంది? హిందూ ధర్మంలో పరమశివుడి రూపం ఎంత విశిష్టమైనదో, ఆయన ప్రతి చిహ్నం అంతే గంభీరమైన తాత్విక అర్థాన్ని కలిగి ఉంటుంది. జటాజూటంలో గంగ, నుదుటిపై చంద్రుడు, చేతిలో త్రిశూలం, మెడలో నాగు... వీటితో పాటు అందరి దృష్టిని ఆకర్షించేది శివుడి మూడో కన్ను . చాలామంది దీనిని కేవలం వినాశనానికి సంబంధించినదిగా భావిస్తారు. కానీ శైవ తత్వం ప్రకారం మూడో కన్ను కేవలం సంహారానికి మాత్రమే కాదు, జ్ఞానం, ఆత్మజాగృతి, సత్యాన్ని దర్శించే దివ్యశక్తికి ప్రతీక. శివుడి మూడో కన్ను అంటే ఏమిటి? మనకు కనిపించే రెండు కళ్లతో భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. అయితే పరమశివుడి మూడో కన్ను సాధారణ దృష్టికి అతీతమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని దివ్య జ్ఞాన నేత్రం అని కూడా పిలుస్తారు. ఈ కన్ను ద్వారా అసత్యం తొలగి, సత్యం మాత్రమే వెలుగులోకి వస్తుందని పురాణాలు వివరిస్తాయి. కామదేవుడి కథ శివ పురాణంలో ప్రసిద్ధమైన ఒక సంఘటన ఉంది. దేవతల కోరిక మేరకు కామదేవుడు పరమశివుడి తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో శివుడు తన మూడో కన్నును తెరవగా, ఆ దివ్య అగ్నిజ్వాలలను తట్టుకోలేక కామదేవుడు భస్మమయ్...